Today is National Anthem Adoption Day
మన దేశానికి జాతీయ గీతంగా ‘జన గణ
మన‘ను స్వీకరించిన రోజు ఇవాళ. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ఆ
గీతాన్ని భారత జాతీయ గీతంగా ఆమోదించింది.
జనగణమన గీతంలో మొత్తం 5 పాదాలు ఉన్నాయి. అందులోని
మొదటి పాదాన్నిమాత్రమే జాతీయ గీతంగా స్వీకరించారు. రవీంద్రనాథ్
టాగోర్ రాసిన ఈ గీతాన్ని రాసి స్వరపరిచారు. ఈ గీతానికి స్వరాలు కట్టడం మన రాష్ట్రంలో
జరగడం విశేషం. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని బీసెంట్ ఆస్తిక కళాశాలను 1919లో ఆయన
సందర్శించాడు. అక్కడున్నప్పుడే ఆయన జనగణమన గీతాన్ని ‘మార్నింగ్ స్టార్ ఆఫ్
ఇండియా’ అంటూ ఆంగ్లంలోకి అనువదించాడు.
జాతీయ గీతాలాపనకు కొన్ని కచ్చితమైన నిబంధనలు
ఉన్నాయి. వాటిలో మొదటిదీ, ముఖ్యమైనదీ కాల వ్యవధి. ఈ గీతాన్ని పూర్తిగా 52 సెకన్లలో
పూర్తిచేయాలి. జాతీయ గీతాన్ని సివిల్, మిలటరీ సంస్థలు, రాష్ట్రపతి,
గవర్నర్ కు గౌరవ వందనం సందర్భాల్లో గానం చేయాలి. రాష్ట్రపతి, గవర్నర్
వంటి ప్రముఖులు లేకపోయినా గణతంత్ర లేదా స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్లలో పాడతారు. రాష్ట్రప్రభుత్వ
అధికార కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా
సందోహ కార్యక్రమాలకు రాష్ట్రపతి వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు,
ఆకాశవాణిలో రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించే ముందు కూడా గానం
చేస్తారు.
1950 జనవరి 24న భారత రాజ్యాంగంపై సంతకం చేయడానికి
అసెంబ్లీ సమాశమైంది. ఈ సమయంలో దేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అధికారికంగా ‘జన గణ
మన‘ ను జాతీయ గీతంగా ప్రకటించారు. దీంతో మన గణతంత్ర
దినోత్సవానికి రెండు రోజుల ముందున ‘జన గణ మన‘ను జాతీయగీతంగా స్వీకరించింది.