అయోధ్య
రామమందిరంలో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వానరం అయోధ్య గర్భగుడిలోకి
ప్రవేశించింది. ఆ తర్వాత వెంటనే తూర్పు ద్వారం గుండా వేలాది మంది భక్తుల మద్య
నుంచే లోపలికి వచ్చి అదే దారిన బయటకు వెళ్ళడం
గమనార్హం.
భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే బయటకు వచ్చేసింది.
సోమవారమే
ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తికావడం, మంగళవారం నాడు వేలమంది భక్తుల మధ్య నుంచి ఓ
వానరం వచ్చి బాల రాముడిని దర్శించుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ
భక్తుడైన హనుమంతుడే స్వామిని దర్శించుకున్నట్లు అనిపిస్తోందని భక్తులు
భావిస్తున్నారు.
సామాన్య భక్తులను దర్శనానికి
అనుమతించిన రోజునే ఆలయంలోకి వానరం రావడం, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళడంపై సోషల్
మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆంజనేయ స్వామినే రాముడి దర్శనం కోసం వచ్చి
ఉంటాడని అనుకుంటున్నారు.
వానరం గర్భగుడిలోకి ప్రవేశించిన విషయాన్ని ఆలయ
ట్రస్ట్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. రామ్ లల్లాను మంగళవారం నాడు 5
లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నేడు
కూడా స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. తోపులాటలు జరగకుండా
పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.