Karpoori Thakur, Bharat Ratna, birth anniversary, CM of Bihar, PM modi
స్వాతంత్ర
సమరయోధుడు, బిహార్ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్‌ను భారతరత్న పురస్కారంతో కేంద్ర
ప్రభుత్వం గౌరవించింది. ఆయన వందో జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ
ప్రకటన చేశారు.
ఇప్పటివరకు భారత రత్న పొందిన వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి, 2019లో
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసింది.
కర్పూరి
ఠాకూర్, బిహార్‌కు రెండుసార్లు సీఎంగా పనిచేశారు.
1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు, 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్
వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఓ మారు ఉపముఖ్యమంత్రిగానూ సేవలందించారు.
1924 జనవరి 24న నాయిబ్రాహ్మణ రైతు కుటుంబంలో
పితౌజియాలో జన్మించారు.
1952లో
తొలిసారి సోషలిస్ట్ పార్టీ తరఫున తేజ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. తుదిశ్వాస
విడిచే వరకు శాసనసభ్యుడిగానే పనిచేశారు.
మంగేరి లాల్ కమిషన్ సిఫార్సుల అమలు, మద్యపాన
నిషేధం అమలులో కీలక పాత్ర పోషించారు. జేడీయూ
అధ్యక్షుడు నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు రాజకీయాల్లో ఠాకూర్
శిష్యులే. 1988లో కన్నుమూశారు. ఠాకూరు కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ ప్రస్తుతం
రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన
మోదీ, పేద, అణగారిన, బడుగు బలహీన వర్గాల
అభ్యున్నతి కోసం కర్పూరి ఠాకూర్ అకుంఠిత దీక్షతో పనిచేశారని కొనియాడారు. ఆయన
నాయకత్వ దార్శనికత భారత సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసిందన్నారు.