Rs 11 Crore Worth Diamond Crown gifted to Ram Lalla
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
భారతీయుల్లో రాముడిపట్ల ఉన్న ఆరాధనా భావనను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఆసేతు
శీతాచలం భారతీయులందరూ తమకు తోచిన రీతిలో రామయ్యకు కానుకలు ఇచ్చుకుంటున్నారు.
గుజరాత్‌కు చెందిన ఒక వ్యాపారి రామ్‌లల్లాకు స్వర్ణవజ్రఖచిత కిరీటాన్ని
సమర్పించాడు.
ముఖేష్ పటేల్ సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త.
గ్రీన్‌ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని. అయోధ్యలో ప్రతిష్ఠితమైన బాలరాముడికి తనవంతుగా
ఏదైనా కానుక ఇవ్వాలని భావించాడు. దానికోసం ఒక కిరీటం తయారు చేయించాడు. నాలుగున్నర
కేజీల బరువున్న ఆ కిరీటాన్ని బంగారం, వజ్రాలు, మరికొన్ని రకాల మణులతో
తీర్చిదిద్దారు.
జనవరి 5న ముఖేష్ పటేల్ సంస్థకు చెందిన ఇద్దరు
ఉద్యోగులు విమానంలో అయోధ్య వెళ్ళారు. బాలరాముడి విగ్రహం శిరస్సు కొలతలు తీసుకున్నారు.
దానికి తగిన పరిమాణంలో కిరీటం తయారు చేసారు. జనవరి 22 కంటె ముందే ఆ తయారీ
పూర్తయింది.
అయోధ్యరామయ్య ప్రాణప్రతిష్ఠ రోజు ముఖేష్ పటేల్ తన
తల్లిదండ్రులతో కలిసి అయోధ్య వెళ్ళాడు. అక్కడ ఆలయ బాధ్యులకు కిరీటాన్ని అందజేసాడు.
ఆలయ ప్రధాన అర్చకులు, శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బాధ్యుల సమక్షంలో
శ్రీరామచంద్రుడికి తన కానుకను ఆయన అందజేసాడని విశ్వహిందూపరిషత్ జాతీయ కోశాధికారి దినేష్
నవాడియా తెలిపారు.