అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో చైనా సైనికులు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. అవును ఇది నిజం. భారత సైన్యంతో కలసి చైనా సైనికులు (ayodya ram temple) వాస్తవాధీన రేఖ వద్ద జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చైనా, భారత్ సరిహద్దుల వెంట గత కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
రెండు దేశాల సైనికాధికారులు చర్చలు జరుపుతోన్నా పరిష్కారం లభించడం లేదు. ఎప్పటికప్పుడు అన్న చందంగా తయారైంది. అయితే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ చైనా సైనికులు సరిహద్దు వెంట భారత సైన్యంతో కలసి జై శ్రీరామ్ నినాదాలు చేయడం విశేషం.ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు భారత సైనికులు ఎక్స్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. అది వైరల్ అయింది.