ప్రపంచ వ్యాప్తంగా, అనేక దేశాలకు చెందిన పౌరుల వ్యక్తిగత డేటా భారీగా లీక్ కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 260 కోట్ల మంది ప్రజల డేటా లీకు వ్యవహారం వైరల్గా మారింది.చైనాకు చెందిన మేసేజింగ్ దిగ్గజ యాప్ టెన్సెంట్తోపాటు, వీబో వినియోగదారుల డేటా కూడా సురక్షితం (data breach is no exception) కాని పబ్లిక్ డొమైన్లో కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి.
డేటా లీకుల వ్యవహారాల్లో ఇప్పటి వరకు ఇదే అతి పెద్దది కావడం గమనార్హం. డ్రాప్ బాక్స్, లింక్డ్ఇన్, ఎక్స్ సహా అనేక సైట్ల నుంచి వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీకి గురైందని పరిశోధకులు చెబుతున్నారు. లీకైన డేటా 12 టెరాబైట్స్ సైజులో ఉందని ఫోర్బ్స్ తన ఓ నివేదికలో తెలిపింది.
ఈ డేటా లీక్ ద్వారా కొందరు అధునాతన ఫిషింగ్ స్కామ్స్, సైబర్ దాడులు, బ్యాంకు ఖాతాల్లోకి చొరబడటం చేయవచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చైనా మేసేజింగ్ దిగ్గజం టెన్సెంట్, వీబో, అడోబ్, కాన్వా, టెలిగ్రామ్ ద్వారా కూడా డేటా లీక్ జరిగిందని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, ఇలాంటి డేటాతో ప్రజలను మోసం చేసే అవకాశాలున్నాయని ఈసెట్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సలహాదారు జేక్ మూర్ అభిప్రాయపడ్డారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు