వైసీపీకి మరో షాక్ తగిలింది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా (ycp mp Lavu Srikrishnadevarayalu resigned) చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. పార్టీ పెద్దల నిర్ణయాలు నచ్చకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
పల్నాడు జిల్లా వైసీపీలో అసమ్మతి ఉందని, దానికి తాను బాధ్యుడిని కాదని ఎంపీ తెలిపారు.నరసరావుపేటలో కొత్త వారిని పోటీలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నాలుగున్నరేళ్లలో నరసరావుపేట నియోజకవర్గ అభివృద్దికి తనకు చేతనైన సాయం చేసినట్లు గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.