దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఇవాళ ప్రారంభంలోనే సెన్సెక్స్ 505 పాయింట్లు పెరిగి 71929 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 21712 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం రూ.83.11 వద్ద మొదలైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక బజాజ్ ఫైనాన్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.
అమెరికా మార్కెట్లు నిన్న భారీ లాభాలతో ముగియడంతో, ఇవాళ ఆసియా మార్కెట్లో లాభాల్లో ప్రారంభం అయ్యాయి. చమురు ధరలు భారీగా తగ్గడం మార్కెట్‌కు కలసి వచ్చింది.