తమ డిమాండ్ల సాధనకు 42 రోజులుగా సమ్మె చేస్తోన్న అంగన్వాడీలు సమ్మె (angawadi strike ) విరమించారు. రాత్రి పొద్దు పోయాక ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. జులై నుంచి జీతాలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అందుకు రాతపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.సోమవారం అర్థరాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ, అంగన్వాడీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. పది హామీలు నెరవేర్చామని, జీతాల పెంపు జులై నుంచి అమలు చేస్తామని మంత్రి హామీ ఇవ్వకడంతో సమ్మె ముగిసింది.
అంగన్వాడీలకు టీఏ,డీఏలు చెల్లింపు, పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. ఆయాల నియామకానికి అర్హత వయసు 45 నుంచి 50 ఏళ్లకు పెంచారు. పదవీ విరమణ ప్రయోజనాలను కార్యకర్తకు రూ.50 వేల నుంచి రూ.1.20 వేలకు పెంచారు. ఆయాలకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతూ జీవో జారీ చేశారు. మట్టిఖర్చుల కింద రూ.20 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మినీ అంగన్వాడీలను అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.