సార్వత్రిక
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల
వారీగా ప్రకటించింది. సీఈవో ఆంధ్రా వెబ్‌సైట్ లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా
విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అసెంబ్లీ
స్థానాల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించింది.
నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల
జాబితాలను సీఈవో ఆంధ్రా వెబ్ సైట్ లో ఎన్నికల సంఘం అప్ లోడ్ చేసింది. జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా కోసం ceoandhra.nic.in ను సందర్శించాలని ఎన్నికల సంఘం తెలిపింది.
గత ఏడాది అక్టోబర్ 27న ఓటర్ల ముసాయిదా
విడుదల చేయగా, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జీరో డోర్ నంబర్
తో ఓటు హక్కు పొందడంపై రాజకీయ పార్టీలు
అభ్యంతరం తెలిపాయి.
రాష్ట్రంలో
4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని గతంలో సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. పురుష
ఓటర్లు 1.99 కోట్ల మంది ఉండగా, మహిళా ఓటర్లు 2.07 కోట్ల మంది ఉన్నారు. 5.8 లక్షల
మందికి ఇంటి దగ్గర నుంచి ఓటు వేసే అవకాశం కల్పించారు. తొలిసారి ఓటు హక్కు పొందిన
వారు 7.88 లక్షల మంది ఉన్నారు.