రామ్‌లల్లా
500 ఏళ్ళ తర్వాత అయోధ్యకు తిరిగొచ్చారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయోధ్య భవ్య
రామమందిర గర్భగుడిలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఆయన మాట్లాడుతూ భారత్ నేడు
స్వర్ణ దినోత్సవాన్ని జరుపుకుంటుందన్నారు.
రామ్
లల్లా కథలు విన్నవారు తమ బాధలు, సమస్యల నుంచి విముక్తి పొందుతారని అన్నారు. నేడు
కొత్త భారత్ ఉద్భవించిందన్న మోహన్ భగవత్ , అందుకు నేడు జరిగిన పవిత్ర కార్యక్రమమే
నిదర్శనమన్నారు.
రామమందిర నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీ చొరవ అభినందనీయమన్నారు.
త్యాగం, ధర్మానికి శ్రీరాముడు ప్రతీకగా నిలిచారని కీర్తించిన భగవత్, సమన్వయంతో ముందుకెళ్ళడమే
మన ధర్మం అన్నారు.
రామ్
లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారిందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ
ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఎన్నో పోరాటాల తర్వాతే ఈ అద్భుత ఘట్టం సాకారమైందన్నారు.
ప్రధాని మోదీ దూరదృష్టి, అంకితభావంతో ఈ మహాత్తర ఘట్టం సాధ్యమైందన్నారు.
అయోధ్యకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు
కేంద్రప్రభుత్వం వందల కోట్లు
కేటాయించిందన్నారు. ప్రధాని మోదీ,
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అయోధ్య ఆలయ ఆకృతులను బహుమతులుగా యోగీ అందజేశారు.