కోట్లాది
మంది హిందువులు ఆకాంక్షించినట్లు అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరారు.
పండితులు నిర్ణయించిన శుభముహూర్తాన గర్భుగుడిలో శ్రీరామచంద్రుడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ
జరిగింది. కమలంపై కొలువుదీరిన బాల రాముడి దివ్య రూపాన్ని చూసి భక్తులు మైమరిచిపోయారు.
జై శ్రీరామ్ అంటూ భారతావని తన్మయత్వంలో మునిగిపోయింది. ధనస్సు ధరించి సకలాభరణాలో
స్వామివారు దర్శనమిస్తున్నారు.
అయోధ్య
బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా స్వామివారికి ప్రధాని మోదీ,
పట్టు వస్త్రాలు, పాదుకలు, తలంబ్రాలు, ఛత్రాన్ని సమర్పించారు. వాటిని స్వీకరించిన
పూజారులు, ప్రధానికి తిలకం దిద్దగా పూజలో కూర్చున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల
మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరిగింది. మేష లగ్నం అభిజిత్ ముహూర్తంలో
బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగగా, కర్తగా ప్రధాని మోదీ వ్యవహరించారు.
ఉత్తర ప్రదేశ్
గవర్నర్ ఆనందీబెన్, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై నుంచి పూలవర్షం
కురిపించారు.
ప్రాణ
ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ తొలి పూజ చేసి హారతి ఇచ్చారు. అనంతరం
బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు.
హిందూవుల
చిరకాలవాంఛ నెరవేరడంతో దేశమంతా రామనామ స్మరణతో మార్మోగుతోంది. ఆలయాల వద్ద శ్రీరామ
భజనలు చేస్తూ భక్తులు పులకించిపోతున్నారు.