అయోధ్య
రామమందిర నిర్మాణం, రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొన్ని గంటల్లో
ప్రారంభకానుంది. గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్యకు ఇప్పటికే అతిథులు చేరుకున్నారు. ప్రతిష్ఠా
కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో భద్రతా బలగాలు మోహరించి
పహారా కాస్తున్నాయి.
ప్రాణ
ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ప్రధాని మోదీ, ఉదయం 10 గంటలకు
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి
నుంచి 10.55 గంటలకు ఆలయానికి చేరుకుని
గంటపాటు ఆలయ ప్రత్యేకతలు వీక్షిస్తారు. మధ్యాహ్నం 12.05 గంటల నుంచి 12.55 వరకు
ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగనుంది.
మధ్యాహ్నం ఒంటి గట్టకు బహిరంగ సభవేదికగా ప్రసంగిస్తారు.
అనంతరం గంటపాటు భక్తులతో ముచ్చటిస్తారు. 2.10 గంటలకు కుబేర్ తిలా ఆలయం ప్రత్యేక
ప్రార్థనలు చేస్తారు. దీంతో ప్రధాని అయోధ్య షెడ్యూల్ పూర్తివుతుంది.
ఆలయ
నిర్మాణ పనులు జనవరి 23 నుంచి మళ్లీ ప్రారంభమవుతాయని రామమందిర నిర్మాణ కమిటీ
చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏడు ఉపాలయాలతో పాటు మిగతా పనులు
ఈ ఏడాదిలోనే పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
161
అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా చేపడుతోన్న మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.
1,100 కోట్లు ఖర్చుకాగా మిగతా పనులు కోసం మరో రూ. 300 కోట్లు అవసరం అవుతాయని
ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. పాత విగ్రహం ఎత్తు తక్కువగా ఉందని
దానిని 25 అడుగుల దూరం నుంచి చూస్తే స్పష్టంగా కనిపించడం లేదని అందుకే కొత్త
విగ్రహం అవసరమైందని వివరించారు.