శబరిమలలో కొలువుదీరిన శ్రీ అయ్యప్పస్వామి
పుణ్యక్షేత్రాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు. మండలపూజల సమయం ముగియడటంతో నేడు
ప్రత్యేక పూజల అనంతరం మూసివేయనున్నారు. మండల పూజల కోసం కోసం గతేడాది నవంబరు 23న ఆలయాన్ని తెరిచారు.
అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం మాలధారులు,
భక్తులు పోటెత్తారు. కానుకల రూపంలో ఆదాయం కూడా బాగానే అందింది. ఈ సీజన్ లో శబరిమల ఆలయాన్ని 50,06,412
మంది భక్తులు దర్శించుకోగా గతేడాది 44 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
ఈ ఏడాది స్వామికి రూ.357.47
కోట్ల ఆదాయం లభించగా గతేడాది ఇదే
మండలం-మకరవిళక్కు సీజన్ లో స్వామివారికి రూ.347.12 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ సీజన్ లో స్వామివారి అరవణ ప్రసాదం విక్రయాలతో
రూ.144.99 కోట్లు, అప్పం అమ్మకాలతో రూ.17.77 కోట్ల ఆదాయం లభించినట్లు దేవస్థానం
బోర్డు ప్రకటించింది.
ఈ
ఏడాది స్వామి దర్శనానికి భక్తులు నానా ఇక్కట్లు పడ్డారు. భక్తులకు తగట్టుగా ఏర్పాట్లు
చేయలేదు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు వదిలి పాదయాత్ర చేయాల్సివచ్చింది. మరో వైపు
మౌలికవసతులలేమితో కూడా భక్తులు అవస్థలు పడ్డారు. దీంతో రూ. 100 కోట్లతో ఆలయ
అభివృద్ధి పనులు చేపడతామని దేవస్థానం బోర్డు ప్రకటించింది.