దేశంలోనే తొలసారి
హర్యానా
రాష్ట్రం ఫరీదాబాద్‌లోని అమృత ఆసుపత్రి అరుదైన ఘనత సాధించారు. ఇద్దరు
వ్యక్తులకు ఏకంగా చేయి మార్పడి ఆపరేషన్ నిర్వహించి వారి జీవితాల్లో ఆశలు నింపారు. ఇలాంటి ఆపరేషన్లు మన దేశంలో జరగడం ఇదే మొదటిసారి.
ఈ రెండు ఆపరేషన్లు డిసెంబరు చివరి వారంలో చేశారు.
దాదాపు 17 గంటలపాటు వైద్యులు శ్రమించినట్లు
ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
గౌతం
తయాల్ అనే వ్యక్తికి పదేళ్ళ కిందట కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. తాజాగా
అతడికే చేయిమార్పిడి ఆపరేషన్ జరిగింది. దీంతో ఈ తరహా ఆపరేషన్ చేయించుకున్న
ప్రపంచంలో రెండో వ్యక్తిగా, దేశంలో మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కాడు.
ఢిల్లీకి
చెందిన గౌతం తయాల్, రెండేళ్ల క్రితం ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చేయిని కోల్పోయాడు.
దీంతో ఇప్పుడు చేయి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు.
థానేకు
చెందిన 40 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్ డెడ్ కాగా అతడి చేయిని తయాల్ కు అమర్చారు. మరో
వారంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
కానున్నారని ఆసుపత్రిలోని సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రక్టివ్ సర్జరీ
వైద్యుడు డాక్టర్ మోహిత్ శర్మ తెలిపారు.
చేయి
మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మరో వ్యక్తి దేవాన్ష్(19). అతడిది కూడా దిల్లీయేనని వైద్యులు
తెలిపారు. మూడేళ్ల కిందట జరిగిన రైలు ప్రమాదంలో రెండు చేతులతో పాటు ఓ కాలు
కోల్పోయాడు. ఇతడికి బ్రెయిన్ డెడ్ అయిన సూరత్‌కు చెందిన 33 సంవత్సరాల వ్యక్తి రెండు చేతులు అమర్చారు.