అయోధ్య(Ayodhya) లో భవ్య రామమందిర ప్రారంభోత్సవం(consecration ceremony), బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (isro)
శ్రీరాముడి
జన్మస్థలికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. స్వదేశీ ఉపగ్రహాలను
ఉపయోగించి ఈ ఫోటోను తీసినట్లు ఇస్రో వెల్లడించింది.
శ్రీరామ
జన్మభూమికి సంబంధించిన 2.7 ఎకరాల స్థలానికి సంబంధించిన చిత్రాన్ని విడుదల చేసింది.
గత ఏడాది డిసెంబర్ 16న దీనిని తీయగా అయోధ్య మొత్తం పొగమంచుతో కప్పబడి ఉంది. దీంతో
అయోధ్యలోని ప్రదేశాలు కొంత అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
రామమందిరంతో
పాటు దశరథ్ మహల్, సరయూ నది, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను ఈ శాటిలైట్ ఇమేజ్
లో చూడొచ్చు. అంతరిక్షంలో భారత్ కు సంబంధించి
50 ఉపగ్రహాలు ఉండగా అందులో చాలా వరకు ఒక మీటరు కంటే తక్కువ రిజల్యూషన్ కలిగిన
చిత్రాలను మాత్రమే తీయగల్గుతాయి.
అయోధ్య తాజా శాటిలైట్ చిత్రాన్ని హైదరాబాద్ లోని జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్
విడుదల చేసింది.
రామమందిర నిర్మాణంలో సైతం ఇస్రో సాంకేతికత
ఉపయోగపడింది. రాముడి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన ఖచ్చితమైన ప్రాంతాన్ని ఇస్రో పరిజ్ఞానంతో
నిర్ధారించారు. గతంలో రాముడి విగ్రహం ఎక్కడ ఉందో కనిపెట్టడం కష్టంగా మారినప్పుడు
ఇస్రో సహకారం తీసుకున్నామని గతంలో రాముడి విగ్రహం ఉన్న చోటే రామ్ లల్లా విగ్రహాన్ని
ప్రతిష్ఠిస్తున్నట్లు వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ వర్మ తెలిపారు.