ఎసైన్డ్
భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజాప్రయోజనాల కోసం,
భూసేకరణలో భాగంగా వెనక్కి తీసుకుంటే మార్కెట్ విలువ మేరకు నష్టపరిహారం
చెల్లిస్తామని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్
ఎసైన్మెంట్ చట్టం-1977కు పలు సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి అజయ్ జైన్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఎసైన్ భూములు కలిగిన వారికి ఇతర
భూముల యజమానులతో సమానంగానే చెల్లింపులు జరుగుతాయని, ఈ విషయంలో సంప్రదింపులకు
అవకాశం లేదని ఉత్తర్తుల్లో స్పష్టం చేశారు.
భూసేకరణ
చట్టం-2013 ప్రకారం భూముల్ని సేకరించినప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్
విలువ కంటే యజమానులు ఎక్కువ ధర డిమాండ్ చేస్తారు. అలాంటి సందర్భాల్లో భూ యజమానులతో
కలెక్టర్ చర్చలు జరిపి ఇరువర్గాలకు అమోదయోగ్యమైన ధర ప్రకటిస్తారు. అసైన్డ్ భూముల
విషయంలో ఇలాంటి అవకాశం లేదని ప్రభుత్వం వివరించింది.
రాష్ట్రప్రభుత్వం
పంపిణీ చేసిన సాగు భూములపై 20 ఏళ్ళు, ఇంటి స్థలాలపై పదేళ్ల అనంతరం యాజమాన్య హక్కులు
లభించే వారి జాబితాన్ని తహసీల్దార్ ప్రకటించున్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత,
తుది జాబితాలను ప్రభుత్వం నిర్దేశించిన ఫాం-6, ఫాం-7 ద్వారా జిల్లా కలెక్టర్‌కు
నివేదిస్తారు. ఆయన ఆమోదంతో 22ఏ నుంచి తొలగిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని
వివరాలు పరిశీలించిన తర్వాత తహశీల్దార్ అర్హుల జాబితాను ప్రకటిస్తారని అజయ్‌జైన్
తెలిపారు.