చిన్న గొడవ రెండు నిండు ప్రాణాలు పోయేలా చేసింది. రూ.500 విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ కారణంగా ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం. గుడివాడ సమీపంలోని వాసవీనగర్కు చెందిన కొలుసు రాంబాబు డ్రైవర్గా చేస్తున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. తాగడానికి డబ్బులేకపోవడంతో రూ.500 ఇవ్వాలని భార్యను అడిగాడు. డబ్బు విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. గొడవ నేపథ్యంలో రాంబాబు ఉరివేసుకుని (telugu crime news ) చనిపోయాడు. చుట్టుపక్కల వారు రాంబాబును కిందకు దించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
రాంబాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని రాంబాబు కొడుకు తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. తన వల్లే భర్త ప్రాణాలుపోయాయని ఆమె కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. చిన్న గొడవతో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. వాసవీనగర్తో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న గొడవతో ఇద్దరు ప్రాణాలు తీసుకోవడంతో కుమారుడు ఏకాకిగా మిగిలిపోయాడు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు