భారత్, మాల్దీవుల దౌత్యపరమైన సంబంధాలను మరింత దెబ్బతీసే ఘటన ఆందోళన కలిగిస్తోంది.బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతోన్న మాల్దీవులకు చెందిన 14 ఏళ్ల బాలుడుని భారత్‌కు చెందిన డోర్నియర్ విమానంలో మాలేలోని ఆసుపత్రికి తరలించేందుకు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజు (bharat maldevis row) అనుమతించలేదు. దీంతో ఆ బాలుడికి అత్యవసర వైద్యం అందక శనివారం చనిపోయాడని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
బ్రెయిన్ ట్యూమర్, స్రోక్‌తో బాధపడుతోన్న ఓ 14 ఏళ్ల బాలుడిని తరలించేందుకు ఎయిర్ అంబులెన్స్ కోసం శనివారంనాడు తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించారు. మారుమూల ద్వీపం నుంచి మాలేలోని అధునాతన వైద్యశాలకు అత్యవసరంగా తరలించాల్సి వచ్చింది.వివరాల్లోకి వెళితే…
బాలుడుకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తల్లిదండ్రులు ఎయిర్ అంబులెన్స్‌కు కాల్ చేశారు. 16 గంటలు గడచినా వారు స్పందించలేదు. దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు తీవ్ర విమర్శలకు దిగారు. భారత్‌కు చెందిన విమానం అందుబాటులో ఉన్నా, దానికి అధ్యక్షుడు అనుమతి ఇవ్వకపోవడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు పెల్లుబికుతున్నాయి.
భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుకు ఉన్న విద్వేషాన్ని తీర్చుకోవడానికి సాధారణ ప్రజలు బలికావాల్సి వస్తోందని…. ఆ దేశ ఎంపీ మైఖేల్ నసీమ్ తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌కు చెందిన విమానాన్ని అనుమతించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆయన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుపై విరుచుకుపడ్డారు.