పశ్చిమాసియా ఇజ్రాయెల్ దాడులతో వేడెక్కింది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు గాజాలో భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్ (israel airstrikes) తాజాగా, పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్‌లపై కూడా విరుచుకుపడింది.తాజా దాడుల్లో ఇరాన్‌కు చెందిన సైనిక సలహాదారులు, హెజ్బొల్లా కమాండర్లను హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ భవనంపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆరుగురు కీలక సలహాదారులు చనిపోయినట్లు తెలుస్తోంది.
డమాస్కస్‌లోని ఓ భవనంలో ఇరాన్ సైనికాధికారుల సమావేశం జరుగుతోందనే పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారిలో ఐదుగురు ఇరాన్ సైనిక సలహాదారులు, ఒకరు సిరియాకు చెందిన సైనిక కమాండర్ చనిపోయినట్లు సమాచారం అందుతోంది. చనిపోయిన వారిలో ఇరాన్
సైనిక సలహాదారుడు జనరల్ సాడెగ్ ఒమిద్ జాదే చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతానికి అతి సమీపంలోనే ఇరాన్, లెబనాన్ ఎంబసీలు కూడా ఉన్నాయి.