అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠకు అంతాసిద్దమైంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోని హిందువులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం జరిగే సమయంలోనే బ్యాంకాక్‌లోని అయుత్తయ్య నగరంలోనూ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశ వీహెచ్‌పీ (thailand vishwa hindu parishad) నిర్ణయించింది. థాయ్ రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలోని చవో ప్రయనది ఒడ్డున వెలసిన అయుత్తయ్య దేవాలయం ప్రపంచ వారసత్వ నగరాల జాబితాలో చేరింది.
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం నాడు అంటే జనవరి 22న అయుత్తయ్యలో దీపోత్సవాలు, రామ భజనలు నిర్వహించనున్నట్లు బ్యాంకాక్ విశ్వ హిందూ పరిషత్ విభాగం తెలిపింది. థాయ్‌లాండ్‌లోని అనేక దేవాలయాల్లో రామభజనలు చేయనున్నారు. అయుత్తయ్య నగర మొదటి రాజు రామతీబోది, అయోధ్య పేరిట అయుత్తయ్య అని పేరు పెట్టారని ప్రపంచ హిందూ ఫౌండేషన్ అధ్యక్షడు స్వామి
విజ్ఞానంద తెలిపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు