పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మొదటి భర్త మూడో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల కాలంలో సానియా మిర్జా ఇన్ స్టాలో మాలిక్ ఫోటోలు తొలగించినప్పటి నుంచి వారి విడాకుల విషయం వైరల్ అయింది.
మాలిక్ సానియా విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా షోయబ్ పోస్ట్ చేసిన ఫోటోలతో వివాదానికి తెరపడినట్లైంది. అయితే వారిద్దరూ విడాకులు తీసుకున్నారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. షోయబ్ మాలిక్‌కు ఇది మూడో వివాహం కావడం గమనార్హం.
2010లో అయేషాతో విడాకులు పొందిన మాలిక్, ఆ తరవాత కొద్ది కాలానికి సానియాను వివాహమాడారు. 2018లో వారికి ఓ కుమారుడు పుట్టాడు. తాజాగా మాలిక్ సనా జావేద్ అనే మహిళను పెళ్లాడారు. ఆమెకు ఇది రెండో వివాహం. 2020లో పాక్‌కు చెందిన ఓ కళాకారుడిని పెళ్లాడిన ఆమె 2023లో విడాకులు పొందారు.