చంద్రయాన్ 3లో అద్భుతం చోటు చేసుకుంది. చంద్రయాన్-3లో (chandrayan-3) అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలో కూడా దక్షిణ ధ్రువం నుంచి ప్రాంతాలను గుర్తిస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా లూనార్ రికనిసెన్స్ ఆర్భిటర్ను ల్యాండర్‌కు అమర్చారు. దీనిలోని రెట్రో రెప్లెక్టర్ ఎరే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్కర్ సేవలను అందిస్తోందని ఇస్రో శుక్రవారంనాడు బెంగళూరుల్లో ప్రకటించింది.
గత నెల 12 నుంచి సంకేతాలు వస్తున్నాయని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-3లో అనేక ప్రైవేటు సంస్థలు తయారు చేసిన ఎల్.ఆర్.ఏలను అమర్చారు. అయితే నాసాకు చెందిన ఎల్.ఆర్.ఏ మాత్రమే సంకేతాలు అందిస్తోందని తెలిపారు. రాత్రి సమయాల్లో మాత్రమే దక్షిణ ధ్రువంలో ఎల్.ఆర్.ఏ సేవలు అందిస్తోంది. ఇందులోని 8 పలకల రెట్రో రిఫ్లెక్టర్లు జాబిల్లిపై వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయని ఇస్రో స్పష్టం చేసింది. 20 గ్రాముల బరువుంటే ఈ పరికరం పదేళ్ల పాటు పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.