దేశీయ స్టాక్ సూచీల నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు (stock market bse nse nifty) దూసుకెళ్లాయి.దేశీయంగా పెట్టుబడిదారులు కొనుగోళ్లకు పోటెత్తారు. శుక్రవారంనాడు స్టాక్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 496 పాయింట్లు పెరిగి చివరకు 71683 వద్ద ముగిసింది. నిష్టీ 160 పాయింట్లు పెరిగి 21622 వద్ద ముగిసింది.
అన్ని రంగాలు రాణించాయి. నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఎస్‌బిఐ లైఫ్ ఇన్య్సూరెన్స్ షేర్లు లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, హెచ్‌డిఎఫ్‌సీ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆయిల్ కంపెనీల సూచీలు 2 శాతం వరకు పెరిగాయి.