Special Song Released by VHP AP, on the occasion of Ayodhya Ram Lalla Temple Consecration
అయోధ్యలో జనవరి 22న జరగబోయే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్
శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక గీతం విడుదల అయింది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ
గీతాన్ని గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. బాలరాముడికి స్వరార్చన
చేసిన ఈ గీతాన్ని నాగ గురునాథ శర్మ రచించారు. డాక్టర్ జోస్యభట్ల సంగీతం
సమకూర్చారు. శ్రీకృష్ణ, వేద వాగ్దేవి గానం చేసారు. చావలి హర్షవర్ధన్, అఖిల్ చంద్ర,
ఐశ్వర్య దరూరి, మేఘన బృందగానంలో పాల్గొన్నారు.
ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత
బాలరాముడు తిరిగి అయోధ్యలో ప్రతిష్ఠితుడు కాబోతున్న శుభ సందర్భానికి ఈ గీతం
అక్షరరూపం ఇచ్చింది. సాహిత్యం, సంగీతం, గాత్రం సమపాళ్ళలో మేళవించిన ఈ గీతం
రామభక్తుల్లో ఉత్సాహం నింపుతోంది.
ఈ
కార్యక్రమంలో మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, విశ్వహిందూపరిషత్ ఆంధ్రప్రదేశ్
ఉత్తరప్రాంత కోశాధ్యక్షులు దుర్గాప్రసాద్ రాజు, ఆర్ ఫ్యాక్టరీ అధినేత విఎస్ రాజు, విశ్వహిందూపరిషత్
విజయవాడ మహానగర కార్యదర్శి క్రోవి రామకృష్ణ, తెలంగాణ ప్రాంత సహకార్యదర్శి శశిధర్, సంగీత
దర్శకుడు జోస్యభట్ల, గాయకుడు శ్రీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.