జ్యోతిర్లింగ
క్షేత్రమైన శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆలయపాలకమండలి చర్చించింది.
అధికారులంతా
సమన్వయంతో పనిచేసి ఉత్సవాల్లో కైంకర్యాలన్నింటికి లోటు లేకుండా జరిపించాలని ఈవో
పెద్దిరాజు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన
చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
పాదయాత్రగా
వచ్చే భక్తుల కోసం పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారం, సాక్షి గణపతి తదితర
ప్రాంతాల్లో బస కల్పించేందుకు ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. తాత్కాలిక వసతి
కల్పించేందుకు గాను ఆరుబయట ప్రాంతాల్లో పైప్ పెండల్స్, షామియానాలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ నెల
12న ప్రారంభమైన సంక్రాంతి ఉత్సవాలు గురువారం నిర్వహించిన పుష్పోత్సవంతో ముగిశాయి.
పార్వతీ సమేత మల్లికార్జున స్వామివార్లు అశ్వవాహనంపై నుంచి భక్తులను
అనుగ్రహించారు. అమ్మవారికి ఇష్టమైన కాగడాలు, ఎర్ర గులాబీలు, తెల్ల చామంతి, మందారం,
లిల్లీ, ఎర్ర గన్నేరు, ఊదా గన్నేరు, నంది వర్దనం, గరుడ వర్దనం, తెల్లచామంతి తదితర
35 రకాల పుష్పాలను సమర్పించారు.
జామ,
ఖర్జూర, నల్లద్రాక్ష వంటి తొమ్మిది రకాల ఫలాలతో పాటు బిల్వం, మరువం, మాచపత్రితో
ప్రత్యేక అలంకరణ చేసి శయనమందిరంలో స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవగా శయనోత్సవాన్ని
నిర్వహించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు