Ram Lalla idol inside Ayodhya temple
Half Day Holiday declared on 22 January in all Central govt
offices
అయోధ్య
భవ్య రామమందిర ప్రారంభోత్స కార్యక్రమాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జనవరి
22న బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఇందుకు సంబంధించిన వైదిక క్రతువులు
ఇప్పటికే కొనసాగుతున్నాయి.
ప్రాణప్రతిష్ఠకు సంబంధించి కీలక ఘట్టం గురువారం నాడు పూర్తైంది.
రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. నిలబడిన ఆకారంలో ఐదేళ్ళ చిన్నారిగా
అయోధ్య రామయ్య దర్శనమిస్తున్నాడు. రామ్‌లల్లా విగ్రహానికి సంబంధించిన ఫొటోను
మీడియాకు విడుదల చేశారు. అయితే ముఖాన్ని పరదాతో కప్పి ఉంచారు. జనవరి 22న
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ బాలరాముడిని భక్తులు దర్శించుకోవచ్చు.
అయోధ్యలో
బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కపూట సెలవు ప్రకటించింది. ఈ
మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన చేశారు.
ఉత్తర
ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానాలో విద్యాసంస్థలకు సెలువు
ప్రకటించారు. గోవాలో పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.
మరికొన్ని రాష్ట్రాలు జనవరి 22ను డ్రై డే గా ప్రకటించాయి.