దేశీయ స్టాక్ సూచీలు పరుగులు పెట్టాయి. బుధవారంనాడు భారీ నష్టాలను మూటగట్టుకున్న సూచీలు మరలా లాభాల్లోకి వచ్చాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 648 (sensex) పాయింట్లు పెరిగి 71835 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 189 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ సూచీ 21652 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో మార్కెట్లు దూసుకెళుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.16 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, విప్రో, టైటాన్, హెచ్‌సీఎల్, యాక్సిస్ బ్యాంక్,ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్,
ఐటీసీ, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలార్జించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టాలను చవిచూసింది. ఐటీ కంపెనీల నుంచి సానుకూల ఫలితాలు రావడంతో గురువారం నాడు
అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. దాని ప్రభావంతో ఇవాళ ఆసియా మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి.ఇవాళ అనేక కంపెనీలు త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలున్నాయి.