ఎర్ర సముద్రంలో రవాణా నౌకలే లక్ష్యంగా చెలరేగిపోతోన్న హౌతీలపై దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ (america president biden on houti rebels) మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఐదు విడతలుగా దాడులు చేసిన అమెరికా, బ్రిటన్ సేనల ముందు హౌతీలు తట్టుకోలేకపోయారని బైడెన్ చెప్పారు. యెమెన్ దేశంలోని హౌతీల స్థావలరాలపై గురువారం నాడు కూడా అమెరికా సైన్యం దాడులు కొనసాగించిందని ఆయన గుర్తుచేశారు.
అమెరికా హెచ్చరికలను హౌతీలు పట్టించుకోవడం లేదు. తమ దాడులు కూడా ఆపేది లేదని హౌతీలు ప్రకటించారు. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మీదుగా ప్రయాణించే రవాణా నౌకలపై తమ దాడులు కొనసాగుతాయని హౌతీ అధినేత అబ్దెల్ మాలెక్ అల్ హౌతీ ప్రకటించారు. గాజాపై ఇజ్రాయల్ యుద్ధానికి వ్యతిరేకంగా తాము ఈ దాడులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా, బ్రిటన్ దాడులకు ప్రతిదాడులుంటాయని అల్ హౌతీ హెచ్చరించారు.
హౌతీల హెచ్చరికలతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయల్‌తో సంబంధం లేని నౌకలపై కూడా హౌతీలు దాడులకు తెగబడటంపై భారత్ మండిపడింది.గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో రవాణా నౌకపై హౌతీలు జరిపిన డ్రోన్ దాడి నుంచి భారత నావికాదళ యుద్ధ నౌక సిబ్బందిని కాపాడింది. వారిలో 9 మంది భారతీయలు కూడా ఉన్నారు. ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై దాడుల నుంచి కాపాడుకునేందుకు నౌకాదళం పహారా కాస్తోందని భారత విదేశాంగశాఖ ప్రధాన కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ ప్రకటించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు