జనన ధ్రువీకరణ
కోసం ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఖాతాదారులు ఇక నుంచి ఆధార్ ను సమర్పించే అవసరం
లేదు. ఈ విషయాన్ని EPFO స్పష్టం చేసింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆదేశాలకు
అనుగుణంగా ఈ ప్రకటన చేసినట్లు వివరించింది. ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు
ధ్రువీకరణ పత్రంగా మాత్రమే పరిగణించాలని, జనన ధ్రువీకరణకు
ప్రామాణికం కాదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల పలు
కేసుల్లో న్యాయస్థానాలు ఆధార్‌ను జనన ధ్రువీకరణ పత్రంగా గుర్తించలేమని తీర్పు
చెప్పాయి. దీంతో ఆధార్ ప్రామాణికత ఆధారంగా పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని స్పష్టం
చేసింది.
ప్రభుత్వ
గుర్తింపు పొందిన విద్యా బోర్డు, విశ్వవిద్యాలయం జారీ చేసే మార్కుల జాబితా, టీసీ, ఎస్‌ఎస్‌సీ
సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు.
సర్వీస్
రికార్డు ఆధారంగా జారీ చేసిన సర్టిఫికెట్
కేంద్ర/రాష్ట్ర
ప్రభుత్వాలు జారీ చేసిన పెన్షన్ సర్టిఫికెట్
ప్రభుత్వం
జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం,
పాన్ కార్డు, పాస్‌పోర్టు, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ను
కూడా ప్రామాణికంగా తీసుకోవచ్చు.