Discrimination against
students in Ayyappa Deeksha in TN Govt School
అయ్యప్ప దీక్ష తీసుకున్న పిల్లలను ప్రభుత్వ
పాఠశాల ఉపాధ్యాయుడు దండించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దాంతో ఆ విద్యార్ధుల
తల్లిదండ్రులు, హిందూసంఘాలు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టాయి.
తమిళనాడు నమక్కల్ జిల్లా చిన్నప్ప నాయకన్ పాళ్యం
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కొందరు విద్యార్ధులు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు.
దీక్షలో భాగంగా వారు నల్లని దుస్తులు, మెడలో అయ్యప్ప మాల ధరించారు. ఆ దీక్షా
వస్త్రాలతోనే తాము చదువుతున్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళారు. బడిలోని ఓ క్రైస్తవ
ఉపాధ్యాయుడికి ఇది నచ్చలేదు. దాంతో అయ్యప్ప దీక్ష తీసుకున్న విద్యార్ధులను
దండించాడు.
గ్రామంలోని మునిసిపల్ పాఠశాలలో బాలమురుగన్ అనే
ఉపాధ్యాయుడు ఉన్నాడు. పేరు హిందూ దైవానిదే కానీ ఆ ఉపాధ్యాయుడు క్రైస్తవమతస్తుడు. దాంతో
అయ్యప్ప దీక్ష తీసుకున్న చిన్నారులపై తన ప్రతాపం చూపించాడు. దీక్ష దుస్తులు, మాల
ధరించి బడికి రాకూడదంటూ గద్దించాడు. వారితో బడి బైట మోకాళ్ళు వేయించాడు.
ఆ సంఘటన వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు
మండిపడ్డారు. పాఠశాలకు వెళ్ళి తమ నిరసన వ్యక్తం చేసారు. వారికి తోడు హిందూ
మున్నాని సంస్థ కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకున్నారు. వారంతా కలిసి పాఠశాల దగ్గర
నిరసన చేపట్టారు. అయ్యప్ప దీక్ష 48రోజుల కాలానికి మాత్రమే పరిమితమైనది అనీ, ఆ
దీక్ష తమ ధార్మిక పద్ధతులకు సంబంధించినది అనీ, వాటిని అవమానించడం, విద్యార్ధులను
శిక్షించడం సరి కాదనీ వారు వాదించారు.
అయ్యప్ప దీక్ష తీసుకున్న
విద్యార్ధులను శిక్షించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు,
హిందూ మున్నాని కార్యకర్తలూ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేసారు. మత స్వేచ్ఛకూ,
వివక్ష లేకుండా తమ ధర్మాన్ని అనుసరించడానికీ తమకున్న హక్కులను పరిరక్షించాలనీ నినదించారు.