అయోధ్య
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు లక్షల లడ్డూలను ఉజ్జయిని మహాకాలేశ్వరుడి
ఆలయం నుంచి అందజేయనున్నారు.
అయోధ్యలో
జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంరోజు నాటికి అయోధ్యకు వీటిని
తరలించనున్నారు.
ఇప్పటికే
నాలుగు లక్షల లడ్డూలకు సంబంధించి ప్యాకింగ్ పనులు పూర్తి కాగా మరో లక్ష లడ్డూలను
ప్యాక్ చేయాల్సి ఉందని మహాకాలేశ్వర్ ఆలయ సహాయ పరిపాలనాధికారి మూల్‌చంద్ జున్వాల్ తెలిపారు.
ఒక్కో లడ్డూ బరువు 50 గ్రాముల కాగా మొత్తం లడ్డూల బరువు 250 క్వింటాళ్ళు దాటనుంది.
వీటిని ట్రక్కుల ద్వారా అయోధ్యకు చేరవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
లడ్డూ
ప్రసాద తయారీ కార్యక్రమంలో ఆలయానికి చెందిన 150 ఉద్యోగులతో పాటు పలు విద్యాసంస్థల సిబ్బంది కూడా పాల్గొని సహకారం
అందిస్తున్నారు. ఐదు రోజుల నుంచి లడ్డూ తయారీ ప్రక్రియ కొనసాగుతోంది.
అయోధ్యలో ఆవిష్కృతమయ్యే మహాత్తర ఘట్టంలో మధ్యప్రదేశ్
కూడా తనవంతు పాత్ర పోషించాలని ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ అభిలాషించారు. అందుకు
అనుగుణంగా ఉజ్జయిని నుంచి అయోధ్య రామయ్యకు ఐదు లక్షల లడ్డూలు అందజేస్తామని జనవరి
12న ప్రకటించారు. అప్పటి నుంచి యుధ్ధ ప్రాతిపదికన లడ్డూ తయారీ పనులు
జరుగుతున్నాయి.
మొఘలుల పాలనలో ధ్వంసమైన రాముడి ఆలయం పున:నిర్మాణం జరగుతున్నప్పుడు అందులో భాగస్వాములు కాకుండా
ఎలాం ఉండగల్గుతామన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి బాస్మతిరకం బియ్యాన్ని
అయోధ్యకు చేరవేశారు.