అయోధ్యలో
జనవరి 22న అద్భుతఘట్టం ఆవిష్కృతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురందరేశ్వరి అన్నారు. భవ్య రామమందిర ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు
పాల్గొనేందుకు ఆ రోజు(జనవరి)ను సెలవు ప్రకటించాలని వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు.
బాలరాముడి
విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని అందరూ వీక్షించే అవకాశం కల్పించాలని కోరారు.
భారతీయుల శతాబ్దాల స్వప్నం, దశాబ్దాల పోరాట ఘట్టం ఆవిష్కృతమవుతున్న రోజును అన్ని
రాష్ట్రాలు గుర్తించి సెలవు ప్రకటించాయన్నారు.
వైసీపీ
ప్రభుత్వం మాత్రం మిగతా రాష్ట్రాలకు భిన్నంగా వ్యవహరించడం సరికాదు అన్నారు.
విజయవాడలో
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా 21 వరకు సెలువు
పొడిగించడాన్ని బీజేపీ స్వాగతిస్తోందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే ఎన్డీయే
ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు.
అయోధ్య
రామమందిర ప్రారంభోత్సవంలో రాష్ట్రప్రజలు భాగస్వామ్యం అయ్యేందుకు గాను జనవరి 22న
సెలవు ప్రకటించాలని కోరారు. 21 వరకు సెలవు ప్రకటించి 22ను పనిదినంగా పేర్కొనడం
వెనుక ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతోందన్నారు.
నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా విజయవాడ పడమట సర్కిల్
లో ఆయనకు నివాళులర్పించారు. తెలుగుప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకోవడానికి కారకులైన
వారిలో ఎన్టీఆర్ ఒకరని కొనియాడారు.