Rohit Sharma goes to the
top
Rohit Sharma 5th T20I century
first player to score 5
T20I centuries
భారత
క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ పలు అరుదైన ఘనత లు సొంతం చేసుకున్నాడు. ఆప్ఘనిస్తాన్‌తో
జరిగిన మూడో టీ20లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. దీంతో టీ20 విభాగంలో 5 సెంచరీల
మార్క్ ను అందుకుని టాపర్ గా నిలిచాడు.
రోహిత్
తర్వాత స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మాక్స్ వెల్ నాలుగు సెంచరీలతో ఉన్నారు. బాబర్ అజమ్, డావిఝి, కోలిన్ మున్రో లు
మూడు సెంచరీలు చేశారు.
బెంగుళూరులో
టీ20లో 121 పరుగులతో నాటౌట్ గా నిలిచిన రోహిత్, 2018లో లక్నోవేదికగా జరిగిన మ్యాచ్
లో కూడా సెంచరీ చేశాడు. 2017లో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై 118
పరుగులు చేశాడు.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది 42వ విజయం. మాజీ
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ శర్మ తాజా విజయంతో సమం
చేశాడు. ధోని ఆధ్వర్యంలో 72 మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించగా రోహిత్ 54 మ్యాచ్‌ల్లోనే 42 విజయాలు సాధించాడు.
మరో
వైపు 1,570 పరుగులు చేయడంతో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు.