ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకలే లక్ష్యంగా చెలరేగిపోతోన్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హౌతీ తిరుగుబాటుదారుల (houti rebels) శిబిరాలే లక్ష్యంగా అమెరికా సైన్యం బుధవారం దాడులు చేసింది. ఎర్ర సముద్రం మీదుగా జలాంతర్గాముల నుంచి క్షిపణులు ప్రయోగించింది. వారం వ్యవధిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హౌతీలకు నిధుల సేకరణ కష్టతరంగా మారింది. అమెరికా ప్రకటన చేసిన కాసేపటికే హౌతీ శిబిరాలే లక్ష్యంగా దాడులు చేసింది. గత శుక్రవారం అమెరికా, బ్రిటన్ సైన్యాలు యెమెన్‌లోని హౌతీ స్థావరాలు లక్ష్యంగా 60 ప్రాంతాలపై దాడులు చేసింది. వాణిజ్య నౌకలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా హెచ్చరించింది. అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ హౌతీలు బుధవారం ఓ నౌకపై డ్రోన్ దాడులకు దిగారు. హౌతీలకు ఆయుధాల సరఫరా నిలిపివేయాలంటూ ఇరాన్‌ను కూడా అమెరికా హెచ్చరించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు