ఆప్ఘనిస్తాన్‌తో
టీ20 సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన చివరి మ్యాచ్ లోనూ భారత్ విజయం
సాధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
చిన్నస్వామి
స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు,
22 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫరీద్ అహ్మద్ మాలిక్ వరుసగా రెండు
బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. యశస్వి జైస్వాల్, కోహ్లీని పెవిలియన్‌కు పంపాడు.
తర్వాత
శివమ్ దూబేను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఔట్ చేయగా సంజు శాంసన్‌ను ఫరీద్ అహ్మద్ మాలిక్
పెవిలియన్‌కు పంపాడు.
రోహిత్ శర్మ, రింకూ సింగ్ జట్టును ఆదుకున్నారు. రోహిత్ శర్మ
69 బంతుల్లో 121 పరుగులు చేయగా, రింకూ 39 బంతుల్లో 69 పరుగులు రాబట్టాడు. దీంతో రోహిత్
సేన 20 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.
213
పరుగుల లక్ష్య ఛేదనలో ఆప్ఘన్ జట్టు పోరాటపటిమ చూపింది. ఏ మాత్రం నిరాశపడకుండా శ్రమించింది.
చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు అవసరం కాగా, 18 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా
అయింది. దీంతో ఫలితం తేల్చేందుకు సూపర్ ఓవర్ కు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.
రహ్మనుల్లా
గుర్బాజ్ (50), ఇబ్రహీం జాద్రాన్(50), నాయబ్(55), నబీ (34) రాణించారు.
భారత
బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు తీయగా, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్
పడగొట్టారు.
మ్యాచ్
డ్రా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా అందులో కూడా స్కోర్లు సమం కావడంతో మరో ఓవర్
నిర్వహించారు.
సూపర్
ఓవర్ లో ఆప్ఘన్ ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. భారత్ కూడా 16 పరుగులే
చేయడంతో మళ్ళీ సూపర్ ఓవర్ నిర్వహించారు.
రెండో
సూపర్ ఓవర్ లో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. 12 పరుగుల
లక్ష్యఛేదనలో ఆప్ఘన్ విఫలమైంది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగల్గింది. దీంతో
భారత్ మూడు టీ20ల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది.