మణిపూర్‌లో హింస కొనసాగుతోంది. గత రాత్రి తౌబాల్ జిల్లాలోని సరిహద్దు భద్రతా దళాలపై (manipur riots) ఓ గంపు దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. మోరెహ్ పట్టణానికి సమీపంలో జరిగిన హింసలో ఇద్దరు భద్రతా దళాల కమాండోలు చనిపోయారు. ఈ ఘటన తౌబాల్ జిల్లా కేంద్రానికి వంద కి.మీ.దూరంలో ఉంది.
పోలీసుల కథనం ప్రకారం. మొదట తౌబాల్ సమీపంలోని 3వ భారత రిజర్వు బెటాలిన్ సైనికులను లక్ష్యం చేసుకుని ఓ గుంపు దాడులకు దిగింది. భద్రతా దళాలు వారిని చెదరగొట్టారు. తరవాత ఆ గుంపులోని తిరుగుబాటుదారులు రెండుగా విడిపోయి తౌబాల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వైపుగా పరుగులు తీశారు.కొందరు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. గౌరవ్ కుమార్, సుబ్రమ్ సింగ్, రాంజీ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. మణిపూర్‌లో మేలో మొదలైన హింస ఇటీవల అదుపులోకి వచ్చింది. మరలా క్రమంగా హింసాత్మక ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.