అయోధ్యలో జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి ముందుగా ఇవాళ శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్నగంతలు తొలగించి, ప్రధాని మోదీ మొదటి సారిగా హారతి (ayodya pm modi harati) ఇవ్వనున్నారు. ఇవాళ జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ పాల్గోనున్నారు.
ప్రాణప్రతిష్టకు ముందు ఆరు రోజుల నుంచే అనేక క్రతువులు నిర్వహిస్తున్నారు.ప్రధాని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం సాధ్యం కాదు కాబట్టి, ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్ర దంపతులు అన్ని పూజలు నిర్వహిస్తున్నారు. 121 మంది ఆచార్యులు పూజా కార్యక్రమాల్లో పొల్గొంటున్నారు. బుధవారం సరయూ తీరంలో కలశపూజ నిర్వహించారు. ఆ కలశాలను రామాలయానికి తీసుకుని వచ్చారు.ఇవాళ బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు.