Stock Markets Bleed Heavily
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు
చవిచూసాయి. సెన్సెక్స్ 1628 పాయింట్లు, నిఫ్టీ 460 పాయింట్లు నష్టపోయాయి.
మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం, వడ్డీరేట్ల
కోత విషయంలో నిరాశ, హెచ్డీఎఫ్సీ షేర్లపై భారీగా అమ్మకాల ఒత్తిడి వంటి
కారణాలు మార్కెట్ల పతనానికి దోహదం చేసాయి. వరుస లాభాలతో సూచీలు గరిష్ఠాలకు చేరిన
వేళ మదుపరులు లాభాల స్వీకరణకు దిగడమూ మరో కారణం. మొత్తంగా సెన్సెక్స్ 1628
పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయింది. 16 నెలల
తర్వాత సెన్సెక్స్‌కు ఇదే అత్యధిక నష్టం. 2022 జూన్
13న సెన్సెక్స్ 1,456 పాయింట్ల మేర నష్టపోయింది.
క్రితం ముగింపు 73,128 పాయింట్లతో పోలిస్తే ఈ ఉదయం సెన్సెక్స్ 71,998.93 పాయింట్ల వద్ద భారీ నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా
అదే ఒరవడి కొనసాగింది. చివరికి 1628.01 పాయింట్ల నష్టంతో 71,500.76 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 460.35 పాయింట్ల నష్టంతో 21,571.95 వద్ద స్థిరపడింది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల