budget
incentives for low-cost housing
ప్రధానమంత్రి నరేంద్రమోదీ
మానసపుత్రిక పథకమైన ఫెడరల్ హౌసింగ్ స్కీంను కొనసాగించాలని కేంద్రప్రభుత్వం
భావిస్తోంది. అందరికీ ఇళ్ళు పేరిట 2015లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకానికి వచ్చే
బడ్జెట్లో కేటాయింపులు పెంచనున్నారు. తక్కువ ధర గృహ రుణాలకు అందజేసే రాయితీలు పెంచేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఫిబ్రవరి1న మధ్యంతర బడ్జెట్
ప్రవేశపెట్టనున్నారు. ఇందులో తక్కువ ధర గృహాలకు కేటాయింపులను 15 శాతానికి పెంచనున్నారు. 2023-24లో ఈ కేటాయింపులు 70 వేల కోట్ల రూపాయలుగా ఉండగా ఈ బడ్జెట్లో అవి లక్షకోట్ల
రూపాయలకు పెరగనున్నాయి.
దేశ జనాభాతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 15 లక్షల గృహాలకుపైగా తక్కువగా
ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2030 నాటికి ఈ సంఖ్య రెండింతలు
అవుతుందని అంచనా.