అయోధ్య
రామమందిర ప్రాణప్రతిష్ఠకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి ముత్యాల
తలంబ్రాలను కానుకగా తీసుకెళుతున్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి బీఎల్ వర్మ
ప్రారంభించారు.
భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు రంగాకిరణ్, మరో సీనియర్ నేత నంబూరి
రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
ముత్యాల తలంబ్రాలతో పాటు
రామానుజుల వారి విగ్రహాన్నిభద్రాద్రి రామయ్య సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించారు.
అయోధ్య
ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలు షేర్ చేస్తోన్న ప్రధాని మోదీ, తాజాగా మరో
వీడియోను పంచుకున్నారు. ప్రముఖ గాయిని లతా మంగేష్కర్ పాడిన శ్రీరామ కీర్తనల్లో
ఒకదానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘శ్రీ రామ్ అర్పణ్’ పేరిట లతా మంగేష్కర్
రికార్డు చేసిన శ్లోకాల్లో ఇదే చివరిదని చెప్పారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ లతా మంగేష్కర్ మన
మధ్యలేకపోవడం విచారకరమన్నారు.
హైదరాబాద్
కు చెందిన ఓ రామభక్తుడు, అయోధ్యాధీశుడి కోసం ప్రత్యేకంగా లడ్డూను తయారు చేయించారు.
నాగభూషణ్ రెడ్డి అనే భక్తుడు, స్వామివారి కోసం1,265 కేజీల బరువైన లడ్డూను సిద్ధం
చేశారు. నేడు ఆ లడ్డూ ప్రసాదాన్ని అయోధ్యకు తీసుకెళుతున్నారు. 24 గంటల పాటు 30 మంది
శ్రమించి లడ్డూను తయారు చేశారు. ప్రత్యేక రిఫ్రిజిరేటర్ బాక్సులో దీనిని అయోధ్యకు
చెరవేస్తున్నారు.
2000
ఏడాది నుంచి శ్రీరామ్ క్యాటరింగ్ సంస్థను నిర్వహిస్తోన్న నాగభూషణ్ రెడ్డి,
రామమందిర నిర్మాణంలో తాను కూడా భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నట్లు
తెలిపారు. అందుకే భూమి పూజ రోజు నుంచి
ప్రారంభోత్సవం వరకు రోజుకు ఒక కేజీ లడ్డూను ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు
తెలిపారు. అందుకే 1,265 కేజీల లడ్డూను అయోధ్య రాముడికి సమర్పిస్తున్నట్లు
చెప్పారు.