Ram Lalla to tour in the premises of temple on day 2 of Consecration
week
అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో
నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో ప్రాణప్రతిష్ఠ వారోత్సవాలు (Consecration
Week) ఇవాళ రెండో రోజుకు (Second Day) చేరుకున్నాయి.
ఇవాళ్టి కార్యక్రమాల్లో భాగంగా బాలరాముడు ఆలయ ఆవరణలో ఊరేగుతాడు. (Ram Lalla
Tour)
‘‘బుధవారం మధ్యాహ్నం జలయాత్ర జరుగుతుంది. దాని
తర్వాత తీర్థ పూజ కార్యక్రమం ఉంటుంది. అది అయ్యాక బ్రాహ్మణ పూజ, వటు పూజ, కుమారీ పూజ,
సువాసినీ పూజ, వర్ధినీ పూజ జరుగుతాయి. తర్వాత కలశయాత్ర ఉంటుంది. అనంతరం బాలరాముడి
మూర్తిని ఆలయ ప్రాసాదం ఆవరణలో ఊరేగిస్తారు’’ అని వేదపండితులు ఆచార్య
గణేశ్వరశాస్త్రి ద్రావిడ్ చెప్పారు. ఆ విషయాన్ని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర
ట్రస్ట్ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది.
మంగళవారం నాడు నూతన
ఆలయంలో పంచగవ్యవప్రాశన జరిగింది. గోక్షీరం, గోపంచకం, గోమయం, గోఘృతం, గోదధి అనే ఐదు
గవ్యాలతో పంచగవ్య ప్రాశన కార్యక్రమం జరిగింది. అంతకుముందు విష్ణుమూర్తికి పూజ చేసారు.
గోదానం సహా దశదానాలు చేసారు. దశదానాల తర్వాత కర్మకూటి హోమం నిర్వహించారు. ఆ
హోమాన్ని విగ్రహాలు తయారుచేసే ప్రదేశంలో నిర్వహించడం విశేషం. చివరిగా వాల్మీకి
రామాయణం, భుశుండి రామాయణాల పారాయణతో మొదటిరోజు కార్యక్రమం సుసంపన్నమైంది