12 lakh people
behind weaving
అయోధ్య
భవ్య రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కు సంబంధించిన కార్యక్రమాలు
కొనసాగుతున్నాయి. ఈ నెల 22న విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. బాలరాముడి కోసం ప్రత్యేకంగా
నేసిన వస్త్రాలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గత రాత్రి రామజన్మభూమి తీర్థక్షేత్ర
ట్రస్టుకు అందజేశారు.
12 లక్షల
మంది భక్తులు ఈ ప్రత్యేక వస్త్రాలను నేశారు. ‘‘దో ధాగే శ్రీరామ్‌కే లియే’’ పేరిట
పుణెకు చెందిన హెరిటేజ్ హ్యాండ్ వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో
రామ్‌లల్లా కోసం ప్రత్యేక వస్త్రాలను నేసారు. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌కు అందజేశారు.
నేడు
బాలరాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో
నిర్మించిన యాగ మండపంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు.
నిన్నటి నుంచి విగ్రహ ప్రతిష్ఠకు
సంబంధించిన క్రతువులు ప్రారంభమయ్యాయి. జనవరి 21,22 తేదీల్లో అయోధ్య ఆలయానికి
సామాన్య భక్తులకు అనుమతి లేదని 23 నుంచి రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని
ట్రస్టు పేర్కొంది.
అయోధ్యకు
వచ్చే భక్తులు రామమందిరంతో పాటు ఇతర ఆధ్మాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారం
తెలుసుకునేందుకు దివ్య్ అయోధ్య యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అని ఉత్తరప్రదేశ్
ప్రభుత్వం తెలిపింది. ఈ యాప్ ను సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు.
ఉత్తర్
ప్రదేశ్ పర్యాటక శాఖ అయోధ్యకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీని ఏర్పాటు
చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కాటేజీలను వీవీఐపీల కోసం వినియోగించనున్నారు. సీతా రసోయి, శబరి రసోయి అనే రెండు డైనింగ్
హాళ్ళను నిర్మించారు.