Sunder Kand recitals in all Vidhan Sabha constituencies
of Delhi
ఢిల్లీలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో (Delhi
Assembly Constituencies) ప్రతీ నెల మొదటి మంగళవారం నాడు సుందరకాండ పారాయణ
(Sunder Kand Recital) జరుగుతుంది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి
(Aam Admi Party) చెందిన మంత్రి సౌరభ్ భరద్వాజ్ (Saurabh
Bharadwaj) ఆ విషయాన్ని ప్రకటించారు.
ఇవాళ్టి నుంచీ ఈ కార్యక్రమం మొదలయింది. చిరాగ్
దిల్లీ ప్రాంతంలో జరిగిన సుందరకాండ పారాయణ కార్యక్రమంలో సౌరభ్ భరద్వాజ్
పాల్గొన్నారు.
‘‘గతంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సుందరకాండ
పారాయణం చేసేవారు. ఇప్పుడు దాన్ని ఒక వ్యవస్థీకృత పద్ధతిలో చేయాలని నిర్ణయం
తీసుకున్నాం. ఈ మంగళవారం నుంచి ప్రతీ నెలా మొదటి మంగళవారం ఢిల్లీలోని అన్ని
నియోజకవర్గాల్లోనూ సుందరకాండ పారాయణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలను కూడా
ఆహ్వానిస్తున్నాం’’ అని సౌరభ్ భరద్వాజ్ చెప్పారు.
సుందరకాండతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ కూడా
చేస్తారు. సుమారు 2600 ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని సౌరభ్
భరద్వాజ్ వెల్లడించారు.
‘‘రామమందిరం గురించి మాకు ఎలాంటి అభ్యంతరాలూ
లేవు. రామమందిర నిర్మాణం మనకు ఎంతో సంతోషకరమైన, గర్వకారకమైన విషయం’’ అని సౌరభ్
వ్యాఖ్యానించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని
బీజేపీ రాజకీయ కార్యక్రమంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్,
సమాజ్వాదీ లాంటి పార్టీలన్నీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై ప్రతికూల వ్యాఖ్యలు
చేస్తూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇండీ కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడీ సుందరకాండ
పారాయణ కార్యక్రమాలు చేపడుతుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.