ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. మరికాసేపట్లో ఆయన అనంతపురం జిల్లా పాలసముద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీని ప్రారంభించనున్నారు. అంతకముందు ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రధాని మోదీతో (pm narendra modi andhra pradesh tour) ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో భద్రత కట్టుదిట్టం చేశారు.
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.541 కోట్ల ఖర్చుతో అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని నాసిన్ కేంద్రం నిర్మించింది. 503 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ కేంద్రం అందుబాటులోకి రానుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట ప్రయాణంలో చేరుకునే విధంగా ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ఐఆర్ఎస్కు ఎంపికైన అభ్యర్థులకు ఇక్కడ శిక్షణ
ఇవ్వనున్నారు.