New outfit for Ram Lalla
అయోధ్యలో (Ayodhya)
కొలువుతీరబోతున్న బాలరాముడికి కొత్తదుస్తులు, కొత్త జెండా (New outfits and
new flag) వచ్చేసాయి. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ (Consecration Ceremony) తర్వాత
వాటిని స్వామికి ధరింపజేస్తారు. రామదళం అధ్యక్షుడు కల్కి రామ్‌దాస్ మహరాజ్ ఈ
కానుకలు అందజేసారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్రనాథ్ దాస్
కొత్తదుస్తులు, జెండాను స్వీకరించారు.
‘‘ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత గర్భగృహంలో
రామచంద్రమూర్తి ఆసీనులయ్యాక ధరించడానికి ఈ దుస్తులు ఉపయోగిస్తాం. అయోధ్యలోని రామదళం
అధ్యక్షులు ఈ కానుకలు తీసుకొచ్చారు. బాలరాముడికి ఆయన ప్రతీయేటా దుస్తులు
సమర్పిస్తుంటారు. ఈసారి కొత్త జెండా కూడా తీసుకొచ్చారు. 1949 డిసెంబర్ 23 నుంచి
ఇదే ప్రదేశంలో పూజలందుకుంటున్న బాలరాముడి కోసమే ఈ దుస్తులు, జెండా అన్నీ’’ అని
సత్యేంద్రనాథ్ దాస్ చెప్పారు.
‘‘శ్రీరామచంద్రుడి ఆశీస్సులు, ప్రధానమంత్రి
నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం సహకారంతోనే ఇదంతా సాధ్యమయింది’’ అని
రామదళం అధ్యక్షుడు కల్కి రామ్‌దాస్ మహరాజ్ అన్నారు.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా బన్కే
బిహారీ ఆలయం భక్తులు ఒక వెండి శంఖం, ఒక పిల్లనగ్రోవి, కొన్ని ఆభరణాలూ సమర్పించారు.
వాటన్నింటినీ సత్యేంద్రనాథ్ దాస్‌కు అందజేసారు. ప్రాణప్రతిష్ఠ రోజు శ్రీరామ
భగవానుడికి వాటిని అంకితం చేయాలని కోరారు.
జనవరి 22న జరగబోయే
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వారం ముందు ప్రారంభించే వైదిక కార్యక్రమాలు రేపు
అంటే జనవరి 16 నుంచి మొదలవుతాయి. ఇప్పటికే అయోధ్యలో 22వ తేదీ వరకు జరిగే అమృత
మహోత్సవాలు నిన్న అంటే జనవరి 14 నుంచి మొదలయ్యాయి. ఈ వేడుక కోసం ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ 11 రోజుల పాటు అనుష్ఠాన దీక్ష వహిస్తున్నారు.