Dharmavaram
Pattu Saree For Ayodhya Seethamma
అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ సమయం దగ్గర
పడటంతో శ్రీసీతారాములకు దేశవిదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. రాముడికి
బంగారు పాదుకలు, సహా ఇతర కానుకలను భక్తులు అందజేస్తున్నారు. తమ ప్రాంతంలో లభించే
ప్రత్యేక ధాన్యం సహా వివిధ రకాల కానుకలు అందజేసి భక్తి చాటుతున్నారు.
ఇందులో
భాగంగా సీతమ్మ వారికి తెలుగుప్రాంతం నుంచి
ఓ అపురూపమైన కానుక అందనుంది.
ప్రత్యేకంగా నేసిన ధర్మవరం పట్టుచీరను
సీతమ్మవారికి ఓ చేనేత కార్మికుడు కానుకగా సమర్పిస్తున్నాడు. 180 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు కల్గిన ఈ
చీరను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు నాగరాజు నేసారు.
చీరపై 13 భారతీయ భాషల్లో జై శ్రీరామ్ అనే నినాదంతో పాటు చీర అంచుల్లో రామాయణానికి
సంబంధించిన 400 ఘట్టాలు చిత్రీకరించారు.
చీర తయారీకి మల్బరీ దారంతో పాటు కాటన్,లెనిన్,
గద్వాల్, సిలికాన్, కొర్నియా పట్టుపొగాలు ఉపయోగించారు. రూ. 5లక్షల ఖర్చు చేసి
నాలుగు నెలల్లో దీనిని రూపొందించారు.
రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట నాటికి అయోధ్య
పంపడమే లక్ష్యంగా పనిచేసినట్లు తెలిపారు. ఈ
పట్టుచీరను అద్దంకి వాసవీనగర్ లోని హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీలోని గోశాలలో
ప్రదర్శనకు ఉంచారు. చీరను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
అయోధ్య రామమందిర నిర్మాణం
జరగడంపై చేనేత కార్మికుడు నాగరాజు ఆనందం వ్యక్తం చేశాడు. ప్రతీ ఏడాదీ సీతమ్మవారికి
చీర పంపే అదృష్టం దక్కాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.