ఆప్ఘనిస్తాన్
తో జరుగుతున్న 3
మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మద్య మూడో
మ్యాచ్ జనవరి 17న బెంగళూరులో జరగనుంది.
ఇండోర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్
లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
తొలి టీ20లో రాణించిన శివమ్ దూబే, రెండో మ్యాచ్
లోనూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో
63 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా
వ్యవహరించాడు. ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా పెవిలియన్ చేరినా జైస్వాల్
తనదైన శైలిలో ఆప్ఘన్ బౌలర్లపై చెలరేగాడు.34 బంతుల్లో
68 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో వీరవిహారం చేశాడు.
వన్డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 29 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు
పెట్టించాడు. రింకూ సింగ్ 9 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో కరీం
జనత్ రెండు,
నవీనుల్ హక్ , ఫజల్చా హక్ ఫరూఖీ చెరో వికెట్
పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. గుల్బదిన్ నాయబ్ 35 బంతుల్లో 57 పరుగులు చేశాడు.
నజీబుల్లా జాద్రాన్ (23) కరీమ్ జనత్(20) ఉర్ రెహ్మాన్(21) రాణించారు.
అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో
రెండు వికెట్లు తీశారు. శివం దూబే కూడా తన ఖాతాలో ఓ వికెట్ వేసుకున్నాడు.
ఇండోర్ మ్యాచ్ లో ఆడిన భారత కెప్టెన్
రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో
150 మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా రోహిత్ శర్మ
రికార్డు సృష్టించాడు.