Makar
Sankranti
దేశ
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ఈ పండుగ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ భావానికి
ప్రతిరూపంగా నిలుస్తోందన్నారు. తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి ఎల్. మురగన్ నివాసంలో
జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, పంచెకట్టులో సందడి చేశారు. కట్టెల పొయ్యి పై
పాయసం వండారు. అనంతరం గోమాతకు పూజ చేసి సారె సమర్పించారు.
సంక్రాంతి పండుగ, ప్రజల
జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ప్రార్థించారు. తన బంధువులు, స్నేహితులతో కలిసి
పండుగ జరుపుకున్నట్లుగా ఉందన్నారు.
సంక్రాంతి
వెలుగుల స్ఫూర్తితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలని ఆకాంక్షించారు.
పండుగులన్నీ వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయన్న ప్రధాని మోదీ, దేశ నిర్మాణంలో రైతుల
పాత్ర కీలకమన్నారు. మంచి పంట, విద్యావంతులు, నిజాయితీ గల వ్యాపారులు కలిసి
దేశాన్ని నిర్మిస్తారన్న తిరువళ్లూరు వ్యాఖ్యలను మోదీ గుర్తు చేశారు.
పండుగ
సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మోదీ ఆస్వాదించారు. ఓ చిన్నారి
పాడిన పాటకు మైమరిచిన మోదీ, ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఆశీర్వదించి తన శాలువా,
ఆమె మెడలో వేసి మెచ్చుకున్నారు.