Bhogi
Celebrations:
ముత్యాల
ముగ్గులు, భోగి మంటలు, పిండివంటలు, చిన్నారుల ఆటపాటలతో తెలుగు లోగిళ్ళు
కళకళలాడుతున్నాయి. ప్రతీ ఇంటి వద్ద రంగవల్లులతో పాటు భోగిమంటలు వేసి సంబరాలు
అంబరాన్ని అంటేలా పండుగ జరుపుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలతో యువత
ఉల్లాసంగా గడుపుతున్నారు. తెలుగు సంప్రదాయ వేషధారణలో యువతరం మెరిసిపోతోంది.
తిరుపతి
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద టీటీడీ అధికారులు భోగిమంట వేశారు. సాయంత్రం
5.30 నుంచి శ్రీ అండాల్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితెరుపు కొలువదీర్చి
ఊరేగింపు నిర్వహిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి
ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పండితులు ఆశీర్వదించారు.
శ్రీశైల
మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
వైభవంగా జరుగుతున్నాయి. ఆదిదంపతులకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం
గ్రామోత్సవంలో భాగంగా రావణ వాహనంపై నుంచి భక్తులను స్వామి, అమ్మవార్లు కటాక్షించనున్నారు.
కోనసీమలో
కోడి పందేల సందడి మొదలైంది. బరుల వద్ద పెద్ద సంఖ్యంలో జనం గుమికూడారు.
రాజకీయ,
వ్యాపార ప్రముఖులు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి మంట వేసిన సీఎం జగన్ దంపతులు,
గంగిరెద్దులకు సారె సమర్పించారు.
అమరావతిలోని
మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో
టీడీపీ
అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం
తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వుల ప్రతులను భోగిమంటల్లో వేసి నిరసన
తెలిపారు.
ఊరూవాడా
సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. మహిళలు రంగువల్లుల పోటీలో ఉత్సాహంగా
పాల్గొంటున్నారు.
విశాఖ
ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు
జీవీఎల్ నరసింహారావు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. బొమ్మల కొలువు, హరిదాసుల
గానం, గంగిరెద్దుల ఆటలతో తెలుగు సంప్రదాయం మరింత ఇనుమడించింది.
నారావారిపల్లెలో
నారా-నందమూరి కుటుంబాలు పండుగ జరుపుకుంటున్నాయి. ఉదయం భోగి సంబరాల్లో పాల్గొన్నారు.
సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు
నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
సత్తెనపల్లిలో సంబరాల్లో పాల్గొన్న అంబటి రాంబాబు, డ్యాన్స్
చేసి అలరించారు.